గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2017 (11:33 IST)

బరువు తగ్గాలనుకుంటే..? పండ్లు మాత్రం తీసుకోండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట మాడ్చుకోవద్దు.. పండ్లు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేకులు, చాక్లెట్లకు బదులుగా పండ్లు, నట్స్ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో అనవసరపు కొవ్వులు కరిగిపోతాయి.

బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట మాడ్చుకోవద్దు.. పండ్లు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేకులు, చాక్లెట్లకు బదులుగా పండ్లు, నట్స్ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో అనవసరపు కొవ్వులు కరిగిపోతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. 
 
అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లను తగినంతగా తాగడం వల్ల జీవక్రియల రేటు మందగించదు. దాంతో కెలొరీలు వేగంగా కరుగుతాయి. అలా బరువు పెరగరు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. కెలొరీలు తక్కువగానే ఉంటాయి కాబట్టి.. వ్యాయమం చేస్తూ వాటిని ఎంచుకోవడం వల్ల ఫలితం కనిపిస్తుంది. 
 
అదేవిధంగా పిండిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారంతో పోలిస్తే మాంసకృత్తులు అధికంగా ఉండే మాంసాహారం, పప్పుదినుసులు తినడం వల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. అదే సమయంలో శరీరంలో చేరిన కెలొరీలూ త్వరగా కరుగుతాయని.. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.