Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

సోమవారం, 26 జూన్ 2017 (21:22 IST)

Widgets Magazine

* ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోండి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవండి. దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చౌతాయి. 
 
* వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
* మీకు ఆకలి వేసినప్పుడే తినేందుకు ప్రయత్నించండి. ఆకలి లేనప్పుడు తినకండి. 
 
* ప్యాకేజ్ ఫుడ్‌ అంటే ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 
 
* మీరు లిఫ్ట్‌లో పై ఫ్లోర్‌లోకి వెళ్ళేటట్లైతే లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. 
 
* మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను సేవించండి. 
 
* పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచింది. 
 
* ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలుండేలా చూసుకోండి. అందులోకూడా ఎక్కువగా తినకండి. తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
* మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పని చేసేవారైతే ప్రతి రెండు గంటలకొకసారి కార్యాలయమంతా కలియ తిరగండి. అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాలపాటు నడవండి. దీంతో మీ శరీరం తేలికగా మారుతుంది. 
 
* ప్రతి రెండు గంటలకొకసారి ఓ ఐదు నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ చేయండి. తదేకంగా గంటలకొద్ది టీవీని చూడకండి. టీవీని చూస్తూ తినడం మూలాన లావు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు.
 
* ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి. 
 
* మీరు తీసుకునే టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. 
 
* మీరు తీసుకునే నీరు మీ శరీర బరువును నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవిస్తుండండి.
 
* చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకుంటుండండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తిన్నది జీర్ణం కాక సతమతం... వాంతి చేసుకోవాల్సిందే... కానీ ఎలా?

పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ...

news

మొబైల్‌ ఫోనుతో 'టెక్ నెక్' సమస్య ... ఇవి కూడా వచ్చేస్తాయ్...

ఏ వస్తువునైనా... ఆఖరికి శరీరాన్నయినా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరి వాడితే తేడా ...

news

పరగడపున మెంతుల చూర్ణం తీసుకుంటే...?

నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ...

news

ఒక్క నిమ్మకాయ మీ అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తోంది...

ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు ...

Widgets Magazine