బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:28 IST)

సరైన పుచ్చకాయను ఎంచుకోవాలంటే చిట్కాలేంటి?

వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఇంగ్లీషులో వాటర్ మెలోన్ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్య

వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఇంగ్లీషులో వాటర్ మెలోన్ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ వేసవిలో కాలంలో ఆరగించేందుకు చాలా ఉపయోగకరమైనది. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచి తక్కువగా ఉందని చెప్పొచ్చు. పుచ్చకాయలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇలాంటి పుచ్చకాయల్లో సరైన కాయను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. 
 
పుచ్చకాయపై మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉండాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కనిపించిందంటే ఆ కాయ మంచిదని గ్రహించండి. ఎందుకంటే ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా నిదర్శనం. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం. అలాంటి కాయలను కొనుగోలు చేయరాదు.