శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:06 IST)

గాఢనిద్ర కోసం ఈ టిప్స్ పాటించండి.!

* ఆకలితో నిద్రకు ఉపక్రమించకండి. అలా అని పడుకునే ముందు బాగా తినాలని కాదు. తేలికగా ఉండి నిద్రకు దోహదం చేసే అమినో అసిడ్ ట్రైప్టోఫాన్ గల ఆహారం తీసుకోవాలి. నిద్రించేందుకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దానివల్ల మీ శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి అలసిపోయినట్లు అవుతారు. రోజంతా క్రియాశీలకంగా గడపండి. అప్పుడు రాత్రి వేళ విశ్రాంతి నిద్రించగలుగుతారు. 
 
* పడుకోబోయే ముందు మద్యపానం చేయకండి. మద్యపానం చేయడం వల్ల బాగా నిద్రపడుతుందని అనుకోవడం భ్రమ మాత్రమే. మద్యం పుచ్చుకోవడం వలన నిద్ర తొందరగా పట్టినా, ఏ అర్థరాత్రి వేళో మెళకువ వచ్చేస్తుంది. కనుక నిద్రకు ముందు మద్యం తీసుకోకపోవడమే మంచిది. కాల్పనిక సాహిత్యమేదైనా చదవండి. మీరు పూర్తిగా పుస్తకపఠనంలో లీనమైపోగలగితే ఒక సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోగలుగుతారు. అలా వెళ్ళిపోయి గాఢనిద్రలోకి జారిపోతారు.