కంద దుంపలను తింటే పురుషులకు ఏమవుతుందో తెలుసా?

గురువారం, 14 జూన్ 2018 (21:36 IST)

మనం నిత్యం వాడే దుంపకూరలలో కంద గడ్డలకు ప్రత్యేకస్ధానం ఉంది. ఇది అనేక రకములైన పోషక విలువలను కలిగిఉంది. ఐతే ఈ కంద గడ్డని అప్పుడప్పుడు కాకుండా రోజువారి ఆహారంలో భాగంగా మార్చుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Yam
 
1. కంద ఒక అధ్బుతమైన, బలవర్ధకమైన ఆహారం. దీనిలో విటమిన్ ఎ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. తరచూ దీనిని తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
2. కందలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. అంతేకాకుండా కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాక ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
3. చిన్న కందగడ్డ ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది. వీటిని తినడం వల్ల ఒబెసిటి, షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
 
4. కంద చంటి పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి మేలు చేస్తుంది. గర్భిణులకు చేసే మేలు అంతాఇంతా కాదు. పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.
 
5. పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. లేత కందకాడలని శుభ్రంగా కడిగి పులుసుగా చేసుకొని తినడం వల్ల డయేరియాను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆకలిని పెంచుతుంది. మూల వ్యాధిని తగ్గిస్తుంది.
 
6. కంద దేహ పుష్టిని కలిగిస్తుంది. అన్నింటికి మించి పురుషులలో వీర్యపుష్టిని కలగచేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.దీనిపై మరింత చదవండి :  
Kanda Gadda Yam Health Benefits

Loading comments ...

ఆరోగ్యం

news

బక్కపలుచగా ఉన్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసం...

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేనివారు కూడా ...

news

రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్‌ని స్ప్రే చేస్తే...

గులాబి చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గులాబీని ఇష్టపడని వారుండరు. గులాబి ...

news

టూత్ పేస్టులతో పేగు కేన్సర్.. నిజమా?

ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఇందుకోసం మనకు ...

news

అవి పశువులు తినేవని అంటారు కానీ... మనుషులు తింటేనా?

మన శరీరానికి పోషకాలు అందించడంలో జొన్నలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వెనుకటి కాలంలో జొన్నలను ...