మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (16:02 IST)

దిండు క్రింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రిస్తే...?

ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయనే సంగతి విదితమే. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా, పడుకునే దిండు క్రింద పెట్టుకున్నాసరే ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తుంది. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చ

ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయనే సంగతి విదితమే. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా, పడుకునే దిండు క్రింద పెట్టుకున్నాసరే ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తుంది. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజు దిండు క్రింద ఒక వెల్లుల్లి రేకును పెట్టుకొని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. 
 
జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దిండు క్రింద వెల్లుల్లిని పెట్టుకొని నిద్రిస్తే చాలు. వెంటనే ఆయా సమస్యల నుండి   ఉపశమనం కలుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు దూరం అవుతాయి. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. లివర్ సంబంధ సమస్యలు దూరమవుతాయి. హోర్మన్ సమస్యలు దూరమై జీవ క్రియలు సక్రంగా జరుగుతాయి. వెంట్రుకలకు పోషణ సరిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బట్టతల సమస్య తొలగిపోతుంది.