Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కీళ్ళ నొప్పులను దూరం చేసే ఆవనూనె.. ఎలాగంటే?

మంగళవారం, 16 మే 2017 (12:00 IST)

Widgets Magazine

ఆవనూనెలో గానీ, నువ్వుల నూనెలో గానీ, నాలుగు వెల్లుల్లిపాయలు వేసి వేడిచేసి నొప్పులున్న భాగాన రాసుకుంటే నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కీళ్ళ నొప్పులకు జాజికాయ బేష్‌గా పనిచేస్తుంది. జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలక్కాయలు వీటిని ఒక్కొక్క భాగంగా తీసుకుని శొంఠి చూర్ణం, తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
అలాగే చేదు పుచ్చ వేరు, పిప్పళ్లు, బెల్లం కలిపి వాటిని మాత్రలుగా చేసుకుని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వేపనూనెలో జిల్లేడు వేరు చూర్ణం కలిపి నొప్పి ఉన్న భాగాన మర్దన చేసుకుంటే చాలా త్వరితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
హార్మోన్ల అసమతుల్యత, సొరియాసిస్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, థైరాయిడ్ ప్రభావంతో కీళ్లనొప్పులు ఏర్పడతాయి. అధిక బరువు, ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పుల వంటి అలవాట్లు కూడా కీళ్లనొప్పుల సమస్యకు కారణమవుతాయి. కీళ్ళ నొప్పులను దూరం చేసుకోవాలంటే..  ఆవనూనెను రోజుకి రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. 
 
అదేవిధంగా ఉల్లిపాయ, ఆవాలు సమభాగాలుగా తీసుకుని బాగా నూరి కీళ్ళపై మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గిపోతాయి. పది గ్రాముల తులసి రసాన్ని.. పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే.. కీళ్ళ నొప్పలు తగ్గుతాయి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవిలో చికెన్ తింటే వేడి చేస్తుంది.. ఎందుకని?

వేసవిలో కాకుండా శీతాకాలమైనా, వర్షాకాలమైన చికెన్ తింటే చాలామందికి వేడి చేస్తుంది. అందుకనే ...

news

నిద్రలేమి, అలసట కారణంగా కళ్లు ఉబ్బితే.. ఏం చేయాలి?

సాధారణంగా నిద్రలేమి, అలసట, నేత్రాలపై ఒత్తిడి ఉన్నవారికి కళ్లు ఉబ్బినట్టు కనిపిస్తాయి. ...

news

తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే.. ఆ ఒక్కటీ చేస్తే చాలు

అనేక మంది శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా శారీరక ...

news

మధుమేహం నియంత్రణలో ఆ ఏడు తప్పులను అధిగమించడం ఎలా?

మీరు మధుమేహాన్ని అదుపు చేసే పథకాన్ని ఈ మధ్యనే అమలులో పెట్టారా? లేక చాలా కాలం నుంచి స్వీయ ...

Widgets Magazine