శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (15:11 IST)

ఎండలు తగ్గాయ్.. చిరుజల్లులు పడుతున్నాయ్.. ఫిట్‌గా ఉండాలంటే?

ఎండలు తగ్గుముఖం పట్టాయి. చిరుజల్లులు మొదలయ్యాయి. సీజన్ మారుతోంది. ఒక్కసారిగా సీజన్ మారేసరికి జలుబు, దగ్గు వస్తుంటాయి. అందుకే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా సీజన్ మారినప్పుడల్లా

ఎండలు తగ్గుముఖం పట్టాయి. చిరుజల్లులు మొదలయ్యాయి. సీజన్ మారుతోంది. ఒక్కసారిగా సీజన్ మారేసరికి జలుబు, దగ్గు వస్తుంటాయి. అందుకే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా సీజన్ మారినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంటే సిట్రస్ పండ్లను తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
నిజానికి నిమ్మ వల్ల శరీరాని ఎంతో మేలు చేకూరుతుంది. చురుకుదనం లభిస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి రోజుకు గ్లాసు చొప్పున తరచుగా నిమ్మరసం తీసుకుంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి. సిట్రస్ పండ్లతో పాటు ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు.. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.