శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:11 IST)

మలబద్ధకానికి స్వాభావికమైన మందు మామిడి పండు...

వేసవి సీజన్‌లో విరివిగా లభించే పండ్లు మామిడి పండ్లు. ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో విరివిగా లభిస్తాయి. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు.

వేసవి సీజన్‌లో విరివిగా లభించే పండ్లు మామిడి పండ్లు. ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో విరివిగా లభిస్తాయి. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. అలాంటి మామిడి పండును ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాంటి మామిడి పండులో క్యాలరీల శక్తి, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు పదార్థం ఇలా అనేక పుష్కలమైన పోషకాలు ఉంటాయి. 
 
ఈ పండును ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణిస్తారు. మామిడి పెద్ద పేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరొటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది.
 
మామిడిలో ఉండే పొటాషియమ్‌ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్‌ డిసీజెస్‌)నూ, రక్తపోటునూ నివారిస్తుంది.  మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.