శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : గురువారం, 17 జులై 2014 (15:45 IST)

హఠాత్తుగా కండరాలు పట్టేస్తే....

చాలా మందికి హఠాత్తుగా కండరాలు పట్టేస్తుంటాయి. అలా ఎందుకు జరుగుతుందో తెలియదు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ కండరాలు పట్టేస్తుంటాయి. కానీ, ఇందుకు అనేక కారణాలు మాత్రం ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. 
 
ముఖ్యంగా.. అతిగా వ్యాయాం చేసినా.. ఎక్కువ దూరం నడిచినా కండరాలు పట్టేస్తాయని అంటున్నారు. అంతేకాకుండా, శరీరంలో ఐరన్, పొటాషియన్, కాల్షియం మోతాదులు తగ్గినపుడు లేదా సోడియంను అధిక మోతాదులో తీసుకున్నపుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని వారు చెపుతున్నారు. అందుకే శరీరంలో ఐరన్ లోపం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు పాలు, పెరుగు, ఆహారంలో తగినంత తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. దీంతోపాటు.. కొబ్బరినీళ్ళు, అరటిపండు, నిమ్మరసాలను సేవిస్తుండాలంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా.. శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉండేందుకు రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగుతూ, మిత వ్యాయామం చేసినట్టయితే ఈసమస్య నుంచి గట్టెక్కవచ్చని వారు సలహా ఇస్తున్నారు.