మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (18:07 IST)

గోళ్ళు కొరుకుతున్నారా? క్యాన్సర్ తప్పదండోయ్!

అవునా.. వామ్మో అనుకుంటున్నారా? నిజమేనండి.. గోళ్ళు కొరికితే క్యాన్సర్ రావడం ఖాయమంటున్నారు వైద్యులు. మానసికోల్లాసం తగ్గడంతో గోళ్ళు కొరికేందుకు చాలామంది అలవాటు పడిపోతున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం పిల్లలు, 45 శాతం మధ్య వయస్కులు, 25 శాతం వృద్ధులు గోళ్ళు కొరికే అలవాటుకు బానిసైపోయారని తాజా అధ్యయనంలో తేలింది. గోళ్ళు కొరకడం కూడా ఫ్యాషనైపోయిందని.. దాన్ని కూడా స్టైల్‌గా కొరుకుతున్నారని స్టడీలో తెలియవచ్చింది. సంతోషంగా, ఒంటిరిగా ఉండటాన్ని ఇష్టపడని వారు గోళ్ళు కొరకడం మొదజలెట్టేస్తున్నారు.  
 
గోళ్ళు కొరకడం ద్వారా.. 
* గోళ్ళలో ఉండే సల్మోనెల్లా, ఇ.కొలి బ్యాక్టీరియా, మురికి నోటి ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. తద్వారా వ్యాధులు తప్పవు. 
 
* వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. పరోనిచియా అనే చర్మ వ్యాధికి దారితీస్తుంది. దీనికి సర్జరీ తప్పదు. గోళ్ళు కొరికే వారికి వేళ్ళలోని క్రిముల ద్వారా హ్యూమన్ పాపిలోమా వైరస్‌తో దెబ్బేనని, తద్వారా క్యాన్సర్ ఏర్పడే ప్రమాదముంది.  
 
పిల్లల్లో గోళ్ళు కొరకే అలవాటుకు చెక్ పెట్టాలంటే?
* గోళ్ళను అప్పుడప్పుడు కత్తిరించి శుభ్రంగా ఉంచాలి. 
* గోళ్ళ చుట్టూ బ్యాండ్ ఏడ్ చుట్టండి. 
* గోళ్ళకు చేతి వేళ్ళకు ఏదైనా పనిపెట్టండి. 
* గోళ్ళ చుట్టూ వేపాకు రసం పూయండి. 
* గోళ్ళను కొరకడం ద్వారా ఏర్పడే అనారోగ్యాల గురించి ఎత్తి చూపండి.