శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (17:33 IST)

నాన్ స్టిక్ సామాన్లను వాడుతున్నారా..? ఇమ్యునిటీ తగ్గినట్టే!

నాన్ స్టిక్ వంటసామాను రెగ్యులర్ ఉపయోగించటం వలన ఎముకల వ్యాధితో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే నాన్ స్టిక్ సామాన్లలోని ఫ్లోరైడ్.. థైరాయిడ్‌కు దారి తీస్తుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం నాన్ స్టిక్ వంట సామాన్లలో PFOA రోజువారీ బహిర్గతం అనేది అత్యంత ఆందోళనకరమైన ప్రమాదాలలో ఒకటి. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. 
 
శరీరంలో హై ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ గుండె జబ్బుల ప్రమాదాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్ స్టిక్ వంటసామాను వాడకం వలన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించే ప్రమాదంగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
నాన్ స్టిక్ వంటసామాను ప్రసరింపచేసే విషపూరిత వాయువులు కాలేయానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇకపోతే.. తరచుగా నాన్ స్టిక్ వంట సామాన్లను ఉపయోగిస్తూ ఉంటే PFOA కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.