శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:16 IST)

టైమ్‌కి తినకపోతే.. బరువు తగ్గరంతే..!

సమయానికి ఆహారం తీసుకోకపోతే.. బరువు తగ్గడం అసాధ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా ఒబిసిటీ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. సమయానికి తగ్గట్లు ఆహారం తీసుకోకపోవడం.. పూటకు పూట చాలా గ్యాప్ తర్వాత ఆహారం తీసుకోవడం శరీరానికి హాని కలిగిస్తుంది. దీని వలన జీవక్రియ నెమ్మదిగా జరగడంతో పాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. తద్వారా బరువు పెరగడాన్ని కట్టడి చేయలేరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
అలాగే బర్గర్లు, వేపుళ్లు లాగించకుండా.. ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆల్కహాల్‌క తక్కువగా తీసుకోవాలి. ఆహార నియంత్రణ ఉండాలి. బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారం ప్రతి రోజు చేసే పనులకు అవసరమైన శక్తిని అందిస్తుంది.