గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (18:01 IST)

మీ గుండె పదిలంగా ఉండాలంటే...

ఇటీవలి కాలంలో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఈ జబ్బుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నాయి. దీనికి కారణం మారిన జీవనశైలితో పాటు... ఆహారపు అలవాట్లు. ఈ నేపథ్యంలో గుండెతో పాటు.. గుండె పనితీరును ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
ఆహారంతో పాటు.. నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. అలాగే పలు ఆరోగ్యకరమైన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. గుండె పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిస్తే, 
 
* గుండె పదిలంగా ఉండాలంటే వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలను ఆహారంగా తీసుకోవాలని కోరుతున్నారు. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను పదిలంగా ఉంచుతుంది.
 
* ఎండు ఫలాల్లో ఒకటైన్ వాల్‌నట్స్‌ను విధిగా తీసుకోవాలి. వీటిలో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి.అలాగే, రక్తనాళాల్లో ఏర్పడిన అవాంతరాలను తొలగించి గుండెపోటులు రాకుండా చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
 
* నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ తినాలి. ఓట్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. ఫలితంగా గుండెపోటుకు గురికాకుండా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.