తాటి కల్లు దివ్యౌషధమా?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (20:31 IST)

palm tree

తాటికల్లు దివ్యౌషధమని చెపుతారు. ఇందులో సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు వుండటంతో ఊబకాయం, మధుమేహం నియంత్రణకు మంచిది. రోగనిరోధకశక్తి అధికమని తేలింది. పూర్వీకులు చెప్పినట్లు తాటిచెట్టు కల్పవృక్షమే. తాటికల్లు సుమధురమైన దివ్య ఔషధమే. స్వర్గలోకంలో అమృత భాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమ్మీద పడి తాటి వృక్షమై మొలిచినదట.

ఇందులో వాస్తవమెంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కల్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనలో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షణగా నిలుస్తుంది. శరీరానికి జవసత్వాలను ఇస్తుంది. బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు పూర్వకాలం నుంచే పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ప్రత్యేక సంధర్భాల్లో దీన్ని సేవిస్తూ ఉంటారు. 
 
సురాపానంగా వ్యవహరించే తాటికల్లులో అనేక ఔషధ గుణాలున్నాయి. దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది. తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ జొన్న రొట్టె తింటే...? ఆరోగ్యానికి కలిగే మేలెంతో తెలుసా?

జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ...

news

రోజూ ఇవి తీసుకుంటే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు.. నీరు-నిమ్మ-పాలు..?

ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ...

news

చిలకడదుంపల్ని కాల్చుకుని తింటేనే బెస్ట్... దురలవాట్లకు ఈ దుంపలతో చెక్

పిల్లలు బరువు పెరగట్లేదా? అయితే చిలకడ దుంపల్ని పెట్టండి. చిలకడదుంపలను కాల్చుకుని, ...

news

స్మార్ట్ ఫోన్ల‌తో ఛాటింగ్ చేస్తున్నారా? నిద్ర గోవిందా.. అనారోగ్యాలు రమ్మంటాయ్..

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో రాత్రిపూట నిద్ర చాలామందికి కరువైంది. పనుల్ని చక్కబెట్టుకుని ...