శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CVR
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (18:04 IST)

బంగాళాదుంపలతో పెద్దపేగు క్యేన్సర్‌కు చెక్..

సాంప్రదాయాలకు పుట్టినిల్లైన మన దేశంలో, ఔషధాల బాండాగారం మన వంటిల్లు. వంటింట్లో లభ్యమయ్యే వస్తువులతోనే ప్రాంతాక వ్యాధుల నుంచి సైతం ప్రాణాలతో బయటపడవచ్చు అంటున్నారు పరిశోధకులు. ప్రాణాంతకమైన క్యేన్సర్ వ్యాధికి వంటింట్లోనే ఔషధం ఉన్నందుటున్నారు. కేన్సర్ వివిధ రకాలు. అందులో పెద్దపేగు కేన్సర్ ఒకటి. అయితే పెద్దపేగు కేన్సర్ మూలకణంపై దాడి చేసే సమ్మేళనం మన ఇంట్లోనే దొరుకుతుందట.
 
ప్రపంచంలో బంగాళాదుంపలు ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లోనూ ఏదో రకంగా బంగాళాదుంపల వినియోగం ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన బంగాళదుంపను ఆయుర్వేదంలో పలు సమస్యలకు నివారణిగా వినియోగిస్తారు. 
 
ఊదారంగు బంగాళా దుంపల్లో పెద్దపేగు కేన్సర్‌ను నివారించే సమ్మేళనం గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కేన్సర్‌ను నివారించాలంటే మూలకణంపై దాడి చేయడమే సరైన వైద్యమని తెలిపిన శాస్త్రవేత్తలు, బంగాళాదుంపలో ఆ సమ్మేళనం ఉన్నట్టు తెలిపారు. బంగాళాదుంపను పూర్తిగా కాల్చినా ఆ సమ్మేళనం నాశనం కాలేదని, అదీకాక కేన్సర్‌ను వ్యాప్తి చేసే మూలకణంపై అది సమర్ధవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైందని వారు స్పష్టం చేశారు.