బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 జనవరి 2015 (15:24 IST)

స్నాక్‌గా సమోసాను లాగిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి!

ఈవెనింగ్ స్నాక్‌గా సమోసాను లాగిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి!. ఫ్రై చేసిన స్నాక్ ఐటమ్‌లో పొటాటో, ఉల్లిపాయ, పచ్చి బఠానీలతో పాటు స్టఫ్ చేసి తయారు చేస్తారు. ముఖ్యంగా సమోసాలలో అధిక కెలోరీలు దాగివున్నాయి. పొటాటోతో పాటు వెజిటేబుల్ ఆయిల్, ఉప్పు ఉండటంతో ఊబకాయానికి దారి తీస్తుంది.
 
అలాగే హై కెలోరీల లిస్టులో హల్వా ఉంటుంది. సన్ ఫ్లవర్ సీడ్స్, వివిధ రకాల నట్స్, బీన్స్, పప్పులు వెజిటేబుల్స్, క్యారెట్, గుమ్మడి, దుంపలు వంటివి ఉపయోగించడం ద్వారా వీటిని తీసుకుంటే ఒబిసిటీ తప్పదు. అలాగే జిలేబీ, రస్ మలై, బట్టర్ చికెన్, చికెన్ కుర్మా, చికెన్ టిక్కా, తందూరి చికెన్, ఫలూడా, పావ్ భాజీ, బర్ఫీ, నాన్ బ్రెడ్, మటన్ కీమా వంటివి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.