శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (13:38 IST)

ఫిట్నెస్ కోసం ఈజీ టిప్స్... సీజన్‌కు తగ్గట్టూ...

గందరగోళ షెడ్యూల్‌లో నిత్యం జీవనపోరాటం చేస్తున్న సగటు మనిషి ఫిట్‌గా ఉండటం చాలా కష్టం. అయినప్పటికీ ఫిట్నెస్ సాధించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు కొన్ని సులభతరమైన టిప్స్ పాటించినట్టయిత

గందరగోళ షెడ్యూల్‌లో నిత్యం జీవనపోరాటం చేస్తున్న సగటు మనిషి ఫిట్‌గా ఉండటం చాలా కష్టం. అయినప్పటికీ ఫిట్నెస్ సాధించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు కొన్ని సులభతరమైన టిప్స్ పాటించినట్టయితే ఖచ్చితంగా ఫిట్‌గా ఉండొచ్చని చెబుతున్నారు.
 
* ప్రతిరోజూ ఒక్కరే వాకింగ్‌కు వెళ్లడానికి బద్ధకంగా ఉంటే మీకు తోడొచ్చే కుటుంబసభ్యులు... ఆఖరికి పెంపుడు కుక్కను తీసుకెళ్లినా ఓకే. 
* అనవసరమైనా ఆలోచనలను తరిమేసి పొద్దుటే పాజిటివ్‌గా ఆలోచించండి. 
* టీవీ చూస్తూ ఏదో ఒకటి తినడం ఆపి, టీవీ చూస్తూ వ్యాయామాలు చేయండి. 
 
* అదేంటి మరి ప్రోగ్రాం మిస్‌ అయిపోతాం కదా అని మీరు అనుకోవచ్చు. సింపుల్‌గా బ్రేక్‌ వచ్చినప్పుడల్లా ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి చాలు.
* ఎప్పుడూ అవే ఎక్సర్‌సైజ్‌లా. కొత్తగా ఈసారి సీజన్‌కు తగ్గట్టూ మీ వ్యాయామాల షెడ్యూల్‌ను కూడా మార్చుకోండి. 
* ఎండాకాలంలో స్విమ్మింగ్‌, టెన్నిస్‌లాంటివి నేర్చుకోండి. 
* చలికాలంలో మీకు నచ్చిన డ్యాన్స్‌ నేర్చుకోండి. 
 
వీటి వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చయి, తక్కువకాలంలోనే ఫిట్‌గా అవుతారు.
* మొదటి రోజునుంచే వ్యాయామాలతో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టకూడదు. 
* నెమ్మదిగా వ్యాయామాల మోతాదును పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఫిట్‌నెస్‌ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. లేకపోతే ప్రతిసారి వ్యాయామం మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది సుమా. 
 
* అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ కారణంగా ఎక్కడికెళ్లినా లిఫ్ట్‌ తప్పనిసరి. ఆఫీసుల్లో కూడా అంతే. అందుకే కనీసం రోజుకు ఒక్కసారి అయినా మెట్ల మీద నడవడం మంచిది. ఇలా చేస్తే గుండెకు రక్త ప్రసరణ జరిగి ఎల్లప్పుడూ ఆర్యోగంగా ఉంటారు.