శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (17:26 IST)

పొట్ట తగ్గాలంటే.. పుదీనా ఆకుల రసం తాగండి.. నిమ్మకాయ-తేనె-వేడినీరు..?

జంక్ ఫుడ్, ఆహారంలో మార్పులు కారణంగా బరువు పెరగడం.. పొట్ట పెరగడం జరుగుతుంది. పొట్ట పెరగడం అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చా

జంక్ ఫుడ్, ఆహారంలో మార్పులు కారణంగా బరువు పెరగడం.. పొట్ట పెరగడం జరుగుతుంది. పొట్ట పెరగడం అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. దీంతో ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. 
 
కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. అందుకే పొట్ట తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగితే సరిపోతుంది. దీనివల్ల మెటబాలిజం పెరిగి, ఒంట్లోని క్యాలరీలు కరిగిపోతాయి. అలాగే ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తింటే కొవ్వు కరిగిపోతుంది. ఇందులోని 9 ఆక్సో ఓడీఏ పదార్థం కొవ్వును సులభంగా కరిగిస్తుంది. 
 
ఇక ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో అల్లం రసం కలుపుకుని తాగండి. దీని వల్ల కొవ్వు తగ్గుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో నిమ్మకాయను పిండి.. అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే పొట్టతో పాటు బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.