మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2015 (18:00 IST)

పంచదార రుచిని మాత్రమే కాదు... అందాన్ని కూడా ప్రసాదిస్తుంది...

తియ్యని పంచదార వివిధ రకాల తినుబండరాలకు రుచిని అందిస్తుంది. ఇదే పంచదార అందాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. వంటింట్లో ఉండే పంచదార చేసే అనేక రకాలైన ఉపయోగాలను తెలుసుకుంటే ఇక అందం మీ సొంతమే... 
 
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ వయస్సుకంటే తక్కువగా కనిపించాలని కోరుకోవడం సహజం. దీనికి పంచదార చక్కగా పని చేస్తుంది. చక్కెరలో యాంటీ ఏజింగ్ ఓ కారకంగా పని చేస్తుంది. చర్మం మృదువుగా మారాలంటే అరకప్పు పంచదారని పావు కప్పు కొబ్బరినూనెలో కలపండి. దీనిలో రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని గాలి ప్రవేశించని డబ్బాలో పోసి కావలసినపుడల్లా ఒంటికి పట్టించి బాగా రుద్దండి. ఇలా చేయడంతో మృతకణాలు తొలగిపోయి చర్మం మెరిసిపోతాయి. 
 
వేసవి కాలంలో ఎండ ప్రభావంతో పాటు దుమ్మూ, ధూళిల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మంపై మురికి పేరుకుపోతుంది. ఇలాంటి సమయంలో కప్పు చక్కెరను, అరకప్పు ఆలివ్ ఆయిల్‌ నూనెని, రెండు చెంచాల నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని కాసేపు రుద్దుకుంటే నలుపుదనం తగ్గుతుంది. 
 
ముఖం బాగా అలసిపోయి కనిపిస్తుంటే కప్పు చక్కెరలో పావుకప్పు ఆలివ్ నూనె కలిపి దానిలోఒక గ్రీన్ టీ బ్యాగు పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా పక్కనపెట్టి మర్నాటి నుంచి దీన్ని ముఖానికి రాసుకుని శుభ్రపరుచుకుంటే ముఖంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి.