శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 20 మార్చి 2015 (12:42 IST)

వేసవి కాలంలో ముక్కులో రక్తం కారుతోందా... జాగ్రత్త.

వేసవి కాలం వచ్చిందంటే కాస్త బయటకు వెళ్లాలంటే భయం వేస్తుంది. ఎక్కడ శరీరం వేడెక్కుతుందో.. ఎప్పుడు ముక్కులోంచి రక్తం కారుతుందోనని భయం వెంటాడుతుంది. ఇది వేసవి కాలంలో ప్రమాదమా.. ? అయితే ఏం చేయాలి? ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? రండీ తెలుసుకుందాం. 
 
వేసవి వచ్చిందంటే చాలా మందికి ముక్కులోంచి రక్తం కారుతుంది. దీనికి చాలా కారణలున్నాయి. సాధారణంగా వేసవి తాపం ఎక్కవైందంటే ముక్కులోంచి రక్తం కారుతుంది. ఇది యుక్త వయస్సులో ఉన్న వారిలో అధికంగా జరుగుతుంటుంది. అదే విధంగా వృద్ధుల్లో డయాలిస్టిక్ స్థాయి 110 ఎం.ఎం/హెచ్ జి కంటే ఎక్కువ అయినప్పుడు జరుగుతుంటుంది. ఇది ప్రమాదకరమా అంటే ప్రమాదకరమే అని చెప్పాలి. 
 
ఇందుకోసం ఏం చేయాలి? అంటే మొదట రోగి తలను, ముఖాన్ని చల్లని గుడ్డతో తుడవాలి. ముక్కుపైన ఇరువైపులా ఐస్ ముక్కలు పెట్టాలి. చీదడం వంటివి చేయరాదు. ముక్కుకు ఒత్తిడి పెరుగుతుంది. డయాలిస్టిక్ అధికంగా ఉంటే రక్తపోటును నియంత్రణలో పెట్టుకునే ఔషధాలు వాడాలి. దానిమ్మ చెట్టు పూల రసాన్ని ముక్కులో వేయాలి. గరిక రసాన్ని తయారు చేసుకుని ముక్కు పుటాలలో 5 నుంచి చుక్కలు వేయాలి.