శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (18:27 IST)

వేసవిలో పురుషులకు స్కిన్ కేర్ టిప్స్ ఇవిగోండి!

వేసవికాలంలో పురుషులు చర్మాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. మొదట హోం మేడ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది చర్మం నాణ్యతను పెంచుతుంది. పెదాల మీద శ్రద్ద పెట్టాలి: సమ్మర్ సీజన్‌లో పెదాల మీద కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో అదనపు చెమట వల్ల పెదాల చాలా త్వరగా పగులుతాయి. నిద్రించే ముందు పెదాలకు బటర్‌తో మసాజ్ చేయాలి. 
 
వేసవిలో ఎక్కువసార్లు షేవ్ చేయకూడదు. షేవ్ చేసేప్పుడు, అప్ వార్డ్ డైరక్షన్‌లో షేవ్ చేయాలి. నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఎక్కువగ ఉపయోగించాలి. హోం మేడ్ ఫేస్ ప్యాక్‌తో చర్మం తాజాగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌తో మొదలు పెట్టి, హెర్బల్ ప్యాక్‌తో ముగించాలి. ఇకపోతే.. ఆరెంజ్ పీల్‌ను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి వచ్చే రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. షేవింగ్ తర్వాత ఇలా చేయడం వల్ల ఫ్రెష్ గా ఫీలవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.