బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: సోమవారం, 31 జులై 2017 (15:41 IST)

ఇది ప్రతి మగాడు వాడాల్సిన కాయ... ఏంటో తెలుసా?

జాజికాయ గురించి చాలామందికి తెలుసు. వంట కోసం జాజికాయను ఎక్కువగా వాడుతుంటారు. కారపు రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుందట. జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పురుషుల్లో కామవాంఛను ప

జాజికాయ గురించి చాలామందికి తెలుసు. వంట కోసం జాజికాయను ఎక్కువగా వాడుతుంటారు. కారపు రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుందట. జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
 
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పురుషుల్లో కామవాంఛను పెంచుతుంది. వీర్యకణాల ఉత్తత్తి పెరిగేందుకు దోహదపడుతుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగినట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు మీ సొంతం. నపుంశకత్వాన్ని తరిమికొడుతుంది. నరాల బలహీనతను పోగొడుతుంది.  ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది. 
 
కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్ళు లేదా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి స్క్రబ్ లా రాసుకోవాలి. ఇలా చేస్తే కొన్నిరోజులకు చర్మం కాంతి వంతమవడంతో పాటు మచ్చలు, మొటిమలు పోయాయి. తాంబూలంలో జాజికాయ పౌడర్‌ను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. అంతే కాదు పళ్ళమీద ఉన్న గార పోయి తెల్లగా కనిపిస్తుంది.