చిలకడదుంపల్ని కాల్చుకుని తింటేనే బెస్ట్... దురలవాట్లకు ఈ దుంపలతో చెక్

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:52 IST)

పిల్లలు బరువు పెరగట్లేదా? అయితే చిలకడ దుంపల్ని పెట్టండి. చిలకడదుంపలను కాల్చుకుని, ఉడికించి, పచ్చివిగానూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా చాలా రుచిగా ఉండే పోషకవిలువలు గల ఆహారం, ఈ దుంపల్ని పాతకాలం నాటి నిప్పులమీద కాల్చుకుని తింటేనే ఆరోగ్యకరం. చిలకడ దుంపల్లో పలు విటమిన్లు గల పిండిపదార్థాలు మాత్రమే గాక ప్రొటీన్లు, ఖనిజాలూ వీటిలో వున్నాయి. ఇవి శక్తినివ్వడమే పుష్టిని కల్గిస్తాయి. 
 
బరువు పెరగాలనుకునేవారు వివిధ రకాల కృత్రిమ పదార్థాలు తీసుకోవడం బదులుగా చిలకడదుంపలు తినవచ్చు. పొగతాగడం, మద్యం సేవించడం, మత్తుపదార్థాలు తీసుకోవడం లాంటి దురలవాట్లు నుండి దూరం కావడానికి ఈ దుంపలు ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆర్థరైటిస్‌, నరాలకు సంబంధించిన రుగ్మతల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అందుకే గుండె ఆరోగ్య పరిరక్షణలోనూ ఇవి మేలైనవి. బహుళ ప్రయోజనకారి. పుష్కలంగా ఫైబర్‌ పోషకాలు ఉన్నాయి. అందువల్ల వీటిని హాయిగా వాడుకోవచ్చు. అల్సర్‌ను దూరం చేస్తాయి. 
 
బంగాళాదుంపలో కంటే చిలకడదుంపలో ఫైబర్‌ ఎక్కువ. రుచి కూడా ఎక్కువే. జీర్ణశక్తికి బాగా ఉపకరిస్తుంది. ఇందులోని పిండిపదార్థాలు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచడంలో చిలకడదుంపలోని బీటాకెరోటిన్‌, మెగ్నీషియం, విటమిన్‌-బి కాంప్లెక్స్‌ తదితర విటమిన్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ఆర్థరైటిస్‌ వల్ల కలిగేటువంటి నొప్పులు శమించ డానికి చిలకడదుంపలు ఉడికించిన నీటిని మర్దనా చేస్తే ఉపయోగం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
చిలకడ దుంప, విటమిన్ 'డీ'ని పుష్కలంగా కలిగి ఉండటమ వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని బీటాకెరోటిన్ క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. కంటికి సంబంధించిన రోగాలను నయం చేస్తుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

స్మార్ట్ ఫోన్ల‌తో ఛాటింగ్ చేస్తున్నారా? నిద్ర గోవిందా.. అనారోగ్యాలు రమ్మంటాయ్..

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో రాత్రిపూట నిద్ర చాలామందికి కరువైంది. పనుల్ని చక్కబెట్టుకుని ...

హృద్రోగుల స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు: ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం

గత పదేళ్లకు పైగా కార్పొరేట్ ఆసుపత్రులకు వేలకోట్ల రూపాయలను ధారపోసి తమాషా నడిపిన తర్వాత ...

news

దేశంలో పెరుగుతున్న మూర్ఛరోగులు : డాక్టర్ దినేష్ నాయక్

దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత ...

news

రోజూ ఓ అరటి పండు తినండి... ఆరోగ్యంగా ఉండండి..

ప్రతిరోజూ ఓ అరటి పండు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చునని.. అనారోగ్య సమస్యల నుంచి ...