నిద్రలేమి, అలసట కారణంగా కళ్లు ఉబ్బితే.. ఏం చేయాలి?

మంగళవారం, 16 మే 2017 (10:54 IST)

eye swelling

సాధారణంగా నిద్రలేమి, అలసట, నేత్రాలపై ఒత్తిడి ఉన్నవారికి కళ్లు ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఇలాంటి త్వరితగతిన ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు... 
 
కళ్లుబాగా ఉబ్బినప్పుడు ఆలూని గుండ్రంగా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అరగంటయ్యాక బయటకు తీసి కళ్ల మీద ఉంచాలి. అపై ఓ పది నిమిషాల తర్వాత వాటిని తీసేసి చల్లటి నీళ్లతో కళ్లు కడిగేస్తే వాపు తగ్గుతుంది. అంతేకాదు బంగాళాదుంపలోని పోషకాలు కళ్ల కింద నలుపునీ పోగొట్టి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
 
గుడ్డులోని తెల్లసొనని కళ్లకింద పూతలా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తడిచేత్తో తుడిచేసి చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే అక్కడ వాపు తగ్గుతుంది. చర్మం బిగుతుగా మారి వలయాలు దూరమవుతాయి.
 
యాంటీఆక్సిడెంట్లు, యాస్ట్రింజెంట్‌ గుణాలున్న కీరదోస కళ్లకి చాలా మేలు చేస్తుంది. కీరాను గుండ్రంగా కోసి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. పావుగంటయ్యాక వాటిని తీసేసి కళ్లు శుభ్రంగా కడుక్కుంటే అలసట తగ్గిపోతుంది. వేడి నుంచి సాంత్వన లభిస్తుంది. వాపు కూడా ఉండదు.
 
పాలని కాసేపు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి అందులో కొన్ని దూది ఉండల్ని వేయాలి. గంటయ్యాక తర్వాత తీసి ఆ ఉండల్ని కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా ఓ 20 నిమిషాల ఉంచుకుంటే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిపై మరింత చదవండి :  
Milk Health Tips Swelling Of The Eyes

Loading comments ...

ఆరోగ్యం

news

తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే.. ఆ ఒక్కటీ చేస్తే చాలు

అనేక మంది శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా శారీరక ...

news

మధుమేహం నియంత్రణలో ఆ ఏడు తప్పులను అధిగమించడం ఎలా?

మీరు మధుమేహాన్ని అదుపు చేసే పథకాన్ని ఈ మధ్యనే అమలులో పెట్టారా? లేక చాలా కాలం నుంచి స్వీయ ...

news

సజ్జ రొట్టెలు తినండి.. ఇలా బరువు తగ్గండి..

సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జల్లో విటమిన్లు, మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగా ...

news

వేసవిలో బార్లీ నీళ్లు తీసుకుంటే.. మేలేంటి?

వేసవిలో బార్లీ నీళ్లు సేవించడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బార్లీగింజల్ని ...