శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (17:31 IST)

స్వైన్ ఫ్లూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరినీ భయపెట్టే వ్యాధి స్వైన్ ఫ్లూ. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజూ ఒక కేసు బయటపడుతూనే ఉంది. ఈ కేసుల జాబితాలో చేరకుండా ఉండాలంటే... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. 
 
ముఖ్యంగా చేతులకు మురికి కానివ్వరాదు. పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇతరులతో చేతులు కలిపిన ప్రతిసారీ శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. లేదా కరచాలనం దాటవేయడం చాలా ఉత్తమం. తుమ్ము, దగ్గు వచ్చినపుడు ముక్కు, నోరు దగ్గర అడ్డంగా పెట్టుకున్నచేతులను వెంటనే కడుక్కోవడం అవసరం. అలా కడుక్కోకుండా చేతులతో కళ్లు, ముక్కు నోరులను అసలు తాకొద్దు. 
 
ఇతరాత్రా బలహీనంగా ఉన్నప్పుడు అంటు రోగాలు సులభంగా సోకుతాయి. కాబట్టి పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందించాలి. నిద్ర, విశ్రాంతి విషయంలో అశ్రద్ధ ఎంతమాత్రం చేయరాదు.