శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Updated : శనివారం, 20 మే 2017 (17:58 IST)

ఈ 6 ఫుడ్ ఐటెమ్స్ తీస్కుంటే వళ్లు తెలియని నిద్ర మీ సొంతం...

అబ్బా... పని ఒత్తిడి. ఎంత నిద్రపోదామన్నా నిద్ర రావడంలేదని చాలామంది వాపోతుంటారు. వళ్లు తెలియని నిద్రపోయి ఎంతకాలమైందో అని బెంగపడిపోతుంటారు. నిద్ర రాకపోవడం వల్ల నిద్రమాత్రలను వేసుకుని మరీ నిద్ర లాగించేస్

అబ్బా... పని ఒత్తిడి. ఎంత నిద్రపోదామన్నా నిద్ర రావడంలేదని చాలామంది వాపోతుంటారు. వళ్లు తెలియని నిద్రపోయి ఎంతకాలమైందో అని బెంగపడిపోతుంటారు. నిద్ర రాకపోవడం వల్ల నిద్రమాత్రలను వేసుకుని మరీ నిద్ర లాగించేస్తుంటారు. కానీ అలాంటి మాత్రల జోలికి వెళ్లకుండా సహజసిద్ధమైన ఈ 6 ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటే వళ్లు తెలియని నిద్ర మీ సొంతం అంటున్నారు పరిశోధకులు.
 
1. చెర్రీస్
తీయతీయగా పుల్లపుల్లగా వుండే చెర్రీస్ అంటే తెలియని వారు వుండరు. వీటిని తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఎందుకంటే వీటిలో మెలోటనిన్ వుంటుంది. ఇది నిద్రపట్టడానికి కారణమవుతుంది.
 
2. అరటిపండ్లు
నిద్రకు ఉపక్రమించడానికి ముందు రెండుమూడు అరటి పండ్లను ఆరగిస్తే సరి. అరటికాయల్లో వుండే మెగ్నీషియం, పొటాషియం కండరాలను రిలాక్స్ చేసి శరీరానికి విశ్రాంతినివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా నిద్ర తన్నుకొస్తుంది.
 
3. రాగిజావ లేదా సగ్గుబియ్యం జావ
పడుకునే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే రాగి జావ లేదంటే సగ్గుబియ్యం జావ పాలతో కలుపుకుని తీసుకుంటే త్వరగా నిద్రపట్టేస్తుంది. అలా కాకుండా నాన్-వెజ్ ఐటమ్స్, మసాలాతో కూడిన పదార్థాలు తీసుకుంటే నిద్ర పట్టేందుకు తిప్పలు తప్పవు.
 
4. చిలకడ దుంపలు
చిలకడ దుంపలు( స్వీట్ పొటాటోస్) నిద్ర పట్టేందుకు బాగా సహకరిస్తాయి. ఇందులో వుండే కార్బోహైడ్రేట్లు, పొటాషియం నిద్ర వచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర రాక తిప్పలుపడేవారు చక్కగా చిలకడ దుంప తింటే సరి.
 
5. పాలు
ఇది అందరికీ తెలిసిన విషయమే. నిద్రించే ముందు పాలు తాగితే నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తుంది. దీనికి కారణం పాలలో వుండే ట్రైప్టోఫాన్ కారణం. ఇది నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది.
 
6. హెర్బల్ టీ
కెఫైన్ లేనటువంటి హెర్బల్ టీ తాగడం వల్ల కూడా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు నిద్రమాత్రలు వేసుకుని వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడకంటే చక్కగా ప్రకృతి అందించిన పదార్థాలు తీసుకుంటే నిద్ర పట్టేస్తుంది.