శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (11:20 IST)

మీ చర్మం కాంతివంతగా మారాలి.. అయితే తేనె వాడండి...!

తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెను సంస్కృతంలో మధువు అంటారు. ఆరోగ్యంను రక్షించు కొనుటకు తేనె చాలా మంచిది. తేనెలో 1.పుటక తేనె 2.కొండ తేనె అని రెండు రకాలుంటాయి.

తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెను సంస్కృతంలో మధువు అంటారు. ఆరోగ్యంను రక్షించు కొనుటకు తేనె చాలా మంచిది. తేనెలో 1.పుటక తేనె 2.కొండ తేనె అని రెండు రకాలుంటాయి. పుటుక తేనె అంటే మామూలు తేనెటీగలు పెట్టిన నాటుతేనె, కొండ తేనె అంటే తుమ్మెదల వంటి తేనెటీగల బండి చక్రాల్లా అడవులలో కొండలలో పెట్టే తెట్టెల నుంచి తీసిన తేనె. మందులలో వాడు కొనుటకు నాటు తేనె శ్రేష్టమైనది.
 
తేనె చలువ చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శక్తిని కలిగిస్తుంది. గుండెకు చాలా మంచిది. నేత్రాలకు మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతి కలిగిస్తుంది. దేహంలో కొవ్వును పెరగనివ్వదు. పుండ్లను మాన్పుతుంది. పుండ్లు, మొటిమలు, చర్మవ్యాధులు, దగ్గు, జ్వరం, రక్తహీనత, గుండె జబ్బులు మొదలగు వాటికి మంచి మందుగా పనిచేస్తుంది. తేనె మూత్రపిండములలోని రాళ్ళను కరిగిస్తుంది. నెమ్మును, పైత్యాన్ని, వేడిని అద్భుతంగా నివారిస్తుంది. ఎక్కిళ్లను ఆపుతుంది. ఊపిరితిత్తుల వ్యాధిని, ఆయాసాన్ని తగ్గిస్తుంది. వికారాన్ని రక్తస్రావాన్ని విరేచనములను నివారించడంలో తిరుగులేనిది తేనె. తేనెను మధుమేహవ్యాధి గల వారు ఏ విధంగాను ఉపయోగించరాదు.
 
నోటిలోని పుండ్లకు, దద్దుర్లకు తేనె బాగా పనిచేస్తుంది. నోటిపూతకు తేనె రాస్తే వెంటనే తగ్గిపోతుంది. సాధారణ దగ్గులకు తేనె, అల్లపు రసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గుతాయి. వాంతులు కట్టు కుంటాయి. ప్రతిరోజూ ఉదయం చల్లని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి త్రాగుతుంటే ఊబశరీరం తగ్గుతుంది. ఇలా తాగుతుంటే ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుముఖం పడుతాయి.
 
తేనె, తులసి రసం, పసుపు కలిపి ఇస్తే న్యుమోనియా, ప్లేగు వంటి వ్యాధులు తగ్గిపోతాయి. లో బి.పి. ఉన్న వారికి నిద్రలేక బాధపడేవారికి తేనె బాగా పనిచేస్తుంది. గాయాలలో పుండ్లు, కురుపులు తేనె పూస్తే మానిపోతాయి. దుష్టప్రణములు కూడా ప్రతిరోజు తేనె రాయలం వల్ల తగ్గిపోతాయి. మొటిమలు ఉన్న వారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ విధంగా కొంతకాలం చేయాలి. తేనెలో పసుపు కలిపి ఉండలు చేసి తింటే మొటిమలు తగ్గుతాయి. 
 
తేనెలో నీరు సున్నము కలిపి కీళ్ల నొప్పులు బెణుకులకు పై పూతగా పూస్తుంటే మంచి మందుగా పనిచేస్తుంది. క్రిమికీటకాలు పుట్టినప్పుడు ఆ కాటుపై మందుగా తేనెను పూయవచ్చు. తేనె, నిమ్మరసం, పాలు, పంచదార కలిపి రోజూ రాత్రిపూట తాగుతుంటే రతి సామర్ద్యము పెరుగును. కొద్ది కాలం నిల్వ ఉన్న తేనెను ప్రతిరోజూ పరిమితంగా తాగుతుంటే శరీర బరువు, నరాల బలహీనత, గుండె దడ వంటివి తగ్గిపోతాయి. రోజూ పడుకుబోయే ముందు ఒక చెంచా తేనె తాగుతుంటే మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు లేచే అవసరముండదు.