బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CVR
Last Updated : గురువారం, 23 జులై 2015 (12:01 IST)

ఉరుకులు, పరుగులు ఒక్క నిమిషం ఆపండి.. యోగాతో కంగారుకు చెక్..

నేటి పోటీ ప్రపంచంలో ఉదయం నిద్రలోంచి మేల్కొన్నప్పటి నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఉరుకులు, పరుగులతో బిజీ బిజీగా గడపుతున్నారు. దీంతో ఏ పని చేయాలో అర్ధంకాక ఒక్కోసారి కంగారు పడిపోతుంటారు. అటువంటి సమయంలో ఒక్క నిమిషం అన్ని పనులను ఆపితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కంగారు పడుతూ ఏ పని చేసినా అది సవ్యంగా సంపూర్ణం కాదని అంటున్నారు. అందుకు కొన్ని సూత్రాలను పాటించాలని చెబుతున్నారు.
 
కంగారుగా అనిపించినప్పుడు ఒక్కసారిగా అన్ని పనులను ఆపేసి, ఐదు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో ఓ కప్పు టీ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది. ఓపిక ఉంటే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం, ధ్యానం చేయడం మంచిది. యోగా చేస్తే మరీ మంచిది. రోజువారి పనుల్లో ఎంత బీజీగా ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం వలన కంగారు తగ్గుతుంది. శరీరంలో శక్తి లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని కంగారు, గుండెల్లో దడ తప్పదంటున్నారు. 
 
మంచి పోషకాహారం తీసుకోవడం వలన రోజంతా ఉత్సాహంగా గడవడంతో పాటు కంగారు పుట్టదు. ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకునే శక్తి కూడా సులువుగా లభిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి, చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేయకుంటే కాడు కంగారు పడాల్సిందే. కనుక వేళకు అనుకున్న పని పూర్తి కావాలంటే, స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టడమే ఉత్తమం. తప్పనిసరైతేనే ఫోన్‌ను చేతిలోకి తీసుకోవాలి. మిగతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విషయంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తే కంగారు పుట్టే ప్రశ్నే తలెత్తదు.