గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (18:21 IST)

బొజ్జ పెరగకుండా ఉండాలంటే లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాల్సిందే!

బొజ్జ పెరగకుండా ఉండాలంటే లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరం నుండి కొవ్వును కరిగించే ఫుడ్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు బొజ్జ తగ్గడం.. తద్వారా గుండెకు మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, డైట్‌లో షుగర్‌ను కంట్రోల్ చేయడం ద్వారా బొజ్జను పెరగకుండా నిరోధించుకోవచ్చు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు.
 
ఆరోగ్యానికి తగినంత నీటిని తీసుకోవడం ద్వారా బొజ్జను కరిగించుకోవచ్చు. ఇది ఆహారం కాకపోయినా, బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరం‌లో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే బరువు తగ్గడం, బొజ్జ పెరగకుండా ఉండటాన్ని గమనించవచ్చు. 
 
వేడినీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి. శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి నీళ్ళు బాగా సహాయపడుతాయి. భోజనానికి ముందు కొన్ని నీళ్ళు త్రాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి తక్కువగా తినేలా చేస్తుంది. తద్వారా బొజ్జ తగ్గడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.