మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:51 IST)

చుండ్రుకు చెక్ పెట్టాలంటే... ఆపిల్ థెరపీ తప్పనిసరి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం అతలాకుతలమౌతోంది. దీంతో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కాలుష్యం కారణంగా చాలామంది చుండ్రుతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య నుంచి అధిగమించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చుండ్రును అరికట్టేందుకు ఫ్రూట్ థెరపీ లేదా వెజిటెబుల్ థెరపీని ఉపయోగిస్తే చుండ్రు సమస్యను అధిగమించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.
 
టమోటా థెరపీ : టమోటా గుజ్జును ఓ ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసుకోండి. ఇందులో కొంత నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలపై పూయండి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు మటుమాయం అంటున్నారు వైద్యులు. 
 
యాపిల్ థెరపీ : రెండు యాపిల్ పండ్లను గుజ్జుగా చేసుకోండి. ఈ గుజ్జును వెంట్రుకలకు పట్టించండి. ఇలా పట్టించిన ఈ యాపిల్ గుజ్జును 45 నిమిషాల వరకు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయండి. వారానికి రెండుసార్లిలా చేస్తుంటే చుండ్రు మటుమాయం అంటున్నారు ఆరోగ్యనిపుణులు.