గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 30 డిశెంబరు 2016 (22:34 IST)

టమోటాతో ఆరోగ్యం, సౌందర్యం...

కూరగాయలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయి. వాటిలో టమోటా ఒకటి. టమోటాలో చర్మానికి మేలు చేసే బోలెడు పోషకాలున్నాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖానికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయ

కూరగాయలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయి. వాటిలో టమోటా ఒకటి. టమోటాలో చర్మానికి మేలు చేసే బోలెడు పోషకాలున్నాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖానికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది. బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. 
 
బరువు తగ్గించుకోవాలంటే.. మహిళలు తప్పకుండా రోజూ ఓ టమోటా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టమోటాలు తినేవారు ఇతర పదార్థాలను పరిమితంగా తింటారని పరిశోధనలు తేల్చాయి. టమోటాలు తింటే కడుపు నిండినట్టు ఉండి ఎక్కువ అన్నంగాని, ఇతర పదార్థాలను తిననీయదు. కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది.