శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (12:03 IST)

తులసి చాయ్‌ తాగండి.. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి..

తులసి చాయ్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి ఆకుల్ని ఉడికించి నిమ్మరసం మాత్రమే చేర్చి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో ఉండే పాలీశాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చక్కె

తులసి చాయ్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి ఆకుల్ని ఉడికించి నిమ్మరసం మాత్రమే చేర్చి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో ఉండే పాలీశాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి. తులసీ టీ తాగడం ద్వారా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలూ దూరమవుతాయి. 
 
చర్మకణాలను ఈ టీ పునరుద్ధరీకరిస్తుంది. తరచూ జలుబుతో బాధపడేవారు రోజుకు రెండు కప్పుల మోతాదులో తులసీ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీనిలోని పోషకాలు జలుబుతోపాటూ ఇతర ఇన్‌ఫెక్షన్లూ దూరం చేస్తాయి. టీలో లభించే బీటాకెరొటిన్లు గుండెకు మేలు చేస్తాయి. గుండెకు రక్త సరఫరా సక్రమంగా ఉండటానికి దోహదం చేస్తాయివి. చెడు కొలెస్ట్రాల్‌ని తులసీ టీ తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.