బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (21:53 IST)

తులసి ఆకులను వేసుకున్న మంచినీళ్లు తాగితే...

మంచినీళ్లు మామూలుగా తాగేకన్నా వాటిలో తులసి ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వుంటాయి. తాగే నీటిలో తులసీ ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నీరు వాసన కలిగి ఉండటంతో పాటు అందులో కంటికి తెలియక దాగివున్న క్

మంచినీళ్లు మామూలుగా తాగేకన్నా వాటిలో తులసి ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వుంటాయి. తాగే నీటిలో తులసీ ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నీరు వాసన కలిగి ఉండటంతో పాటు అందులో కంటికి తెలియక దాగివున్న క్రిములు నశిస్తాయి. 
 
ఆహారం తీసుకునేందుకు ముందు గోరు వెచ్చగా ఒక గ్లాసుడు నీటిని సేవించవచ్చు. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వేడి నీటిని సేవించడం ద్వారా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.  
 
మనం తీసుకునే ఆహారంలో నూనె ఎక్కువ శాతం ఉన్నా, స్వీట్స్ ఎక్కువగా తీసుకున్నా వేడి నీటిని సేవించడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. వేడినీటిని తాగడం ద్వారా నోటి దుర్వాసన, గొంతునొప్పికి కూడా చెక్ పెట్టవచ్చు. వేడినీటిని తాగడం ద్వారా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ దూరమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.