గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (15:09 IST)

పసుపుతో ఈ వ్యాధులన్నీ తగ్గుతాయి... చిట్కాలు

* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. * గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండు మూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి. * పసుపు కొమ్ము బెల్లం

* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండు మూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* పసుపు కొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి, ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో ఉండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడం వల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడి చేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.