Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మతిమరుపుకు దివ్యౌషధంగా పనిచేసే కాఫీ

శుక్రవారం, 30 జూన్ 2017 (12:08 IST)

Widgets Magazine
coffee

వృద్ధాప్యంతో సంబంధం లేకుండా చాలామందిని భయపెడుతున్న సమస్య మతిమరుపు. అలాంటి మతిమరుపుకు కాఫీ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాఫీలోని కెఫీన్‌తో పాటు  అందులో వుండే ఇతరత్రా మూలకాలన్నీ కూడా మెదడులోని హానికర ప్రోటీన్ల శాతాన్ని తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు తేల్చేశారు. ముఖ్యంగా కాఫీలోని 24 రసాయనాలు ఎన్ఎమ్ఎన్‌ఏటీ2 అనే ఎంజైమ్‌ను విడుదల చేయడం వల్ల మతిమరుపు, అల్జీమర్స్.. లాంటి నాడీ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.  
 
అయితే కాపీని అధికంగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా కాఫీ లేదా బ్లాక్‌ కాఫీ రెండు రకాలుగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీకి బదులుగా తక్కువ క్యాలరీలున్న బ్లాక్‌ కాఫీ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
 
ఎందుకంటే... ఒక కప్పు బ్లాక్‌ కాఫీలో కేవలం 4.7 క్యాలరీలున్నాయి. అదే రెగ్యులర్‌ కాఫీలో అయితే ఏకంగా 56.6 క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారుబ్లాక్‌ కాఫీ తీసుకోవడమే ఉత్తమం. అలాగే, సాయంత్రం వేళల్లో నిద్ర సమస్యలతో బాధపడేవారు సాధారణ కాఫీ అంతగా తీసుకోకపోవడమే మంచిది. కానీ, ఎసిడిటి ఉన్నవాళ్లు మాత్రం బ్లాక్‌ కాఫీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదట.. ఎందుకంటే?

దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదంటున్నారు.. అమెరికా శాస్త్రవేత్తలు. దంపతుల్లో ...

news

ఎంత తింటున్నామనేది తెలియకుండా పొట్ట నిండా లాగించేస్తే...

సాధారణంగా పని ఒత్తిడిలో సమయానికి భోజనం చేయడం చాలామంది మరచిపోతుంటారు. పని ఒత్తిడి ...

news

రోజూ 2 గ్రాముల ఆవాలు మింగితే...?

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు వుంటాయి. వాటిలో నల్ల ఆవాలు కూడా ఒకటి. ఇవి ...

news

యోగా డేంజరట.. పరిశోధన

ప్రపంచ యోగాదినోత్సవం ఇటీవలే ముగిసింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ...

Widgets Magazine