శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (10:54 IST)

సమ్మర్‌ స్పెషల్.. ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయను తినకండి..

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. డయేరియా, ఇన్‌ఫెక్షన్‌లను పుచ్చకాయలోని పోషకాలు నివారిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో సమస్యల్ని అదుపు చేస్తాయి. అన్ని వయసు

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. డయేరియా, ఇన్‌ఫెక్షన్‌లను పుచ్చకాయలోని పోషకాలు నివారిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో సమస్యల్ని అదుపు చేస్తాయి. అన్ని వయసుల వారూ దీన్ని తీసుకోవచ్చు. కోసిన ముక్కలు ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడం మంచిది.
 
అలాగే వేసవిలో ఇంట్లో ఉన్నా సరే ఈ కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. చిన్నారులూ, వృద్ధులూ, గర్భిణులు ఎక్కువగా తీసుకోవాలి. ఈ నీళ్లలో సహజ చక్కెర్లూ, ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కి లోనుకాకుండా కాపాడతాయవి.
 
ఈ కాలంలో కాఫీలూ, టీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. బయటకు వెళ్లేప్పుడు మజ్జిగ తీసుకుంటే హాయిగా ఉంటుంది. వేడి ప్రభావం కూడా తగ్గుతుంది. కూరలూ, మసాలా పదార్థాలు మితంగా తీసుకుని పెరుగన్నం తినడం అలవాటు చేసుకుంటే మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, ల్యూటిన్‌ వంటివి ఇందులో ఎక్కువ. ఇవి అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడుకోవడానికి సాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.