మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: బుధవారం, 18 నవంబరు 2015 (19:24 IST)

తక్షణ శక్తినిచ్చే ఆహారం ఏంటి...? ఇవి తీసుకుంటే...

తింటూనే ఉంటాం. కానీ నీరసం ఆవహించి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నీరసాన్ని పారద్రోలి తక్షణ శక్తి కోసం ఇవి తీసుకుంటే మేలు అంటున్నారు వైద్య నిపుణులు. క్యారెట్లు... వీటిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేయడంతోపాటు అలసటను దూరం చేస్తుంది. కనుక వీటిని సలాడ్ల రూపంలో అయినా లేదంటే వాటి తొక్కు తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆఫీసుకు తీసుకెళ్లి కూడా తినేయవచ్చు. వాటిని తింటుంటే నీరసం ఆవహించకుండా ఉంటుంది.
 
రెండోది ఆపిల్. ఈ యాపిల్ పండులో శక్తినిచ్చే విటమిన్లు, మినరల్స్ వంటివాటితోపాటు పీచు పదార్థం కూడా పుష్కలంగా లభ్యమవుతుంది. రోజుకో యాపిల్ తినడం వల్ల రోజంతా హుషారుగా ఉంటుంది. ఇంకా ఓట్ మీల్స్ కూడా తింటుంటే నీరసాన్ని దరిచేయకుండా చేస్తుంది.