గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (18:32 IST)

బరువు తగ్గాలంటే.. పాలతో ఓట్ మీల్ తీసుకోండి.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఉదయం లేవగానే పాలతో కలిపి ఓట్‌మీల్ తీసుకోవాలి. డ్రెస్సింగ్, మేకప్ వేసుకునే సమయంలో తినేసేయాలి. జర్నీలో తినడానికి అనువుగా ఒక అరటిపండు, ఆపిల్‌ను బ్యాగ్‌లో తీసుకెళ్లాలి. 
 
సాయంత్రం సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు తినేందుకు డ్రై ఫ్రూట్స్ నట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. డిన్నర్‌, లంచ్‌లో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. 
 
తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. ఆపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.