శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (17:16 IST)

రాత్రి భోజనం తీసుకోకుండా భోజన వేళలు మార్చేస్తే బరువు తగ్గిపోవచ్చట

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కొందరు ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తే కొందరు వ్యాయామాలు చేస్తుంటారు. ఇంకొందరు పస్తులతో బరువు తగ్గాలనుకుంటా

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువు తగ్గేందుకు చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కొందరు ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తే కొందరు వ్యాయామాలు చేస్తుంటారు. ఇంకొందరు పస్తులతో బరువు తగ్గాలనుకుంటారు. అయితే అటువంటి కష్టాలు ఇక అవసరం లేదని, ఆహారం తీసుకునే వేళలను మార్చడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. 
 
మనం మధ్యాహ్న భోజనమే ఆ రోజుకు చివరిది అయితే బరువు తగ్గడం యమా ఈజీ అని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుందని వివరించారు. మనుషుల్లో ఎర్లీ టైమ్-రిస్ట్రెక్టడ్ ఫీడింగ్(ఈటీఆర్ఎఫ్)పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు అమెరికాలోని బర్మింగ్‌హ్యామ్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అలబామా అసోసియేట్ ప్రొఫెసర్ కోర్ట్నీ పీటర్‌సన్ తెలిపారు.