శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (17:53 IST)

బురిడీ కొట్టించే వంట నూనెలు... రోగాలు రాకుండా చేసే నూనెలివే...

వంట నూనె లేనిదే మనకు ఏ వంట ముగియదు. వంటల్లో నూనెలు వాడుతూనే వుంటాం. ఐతే ఈమధ్య ప్యాకెట్లలో వచ్చే నూనెలు ఎక్కవయిపోయాయి. ఏవేవో బ్రాండ్లతో దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. అవి ఎలాంటివో తెలుసుకోకుండానే మనం వాటి

వంట నూనె లేనిదే మనకు ఏ వంట ముగియదు. వంటల్లో నూనెలు వాడుతూనే వుంటాం. ఐతే ఈమధ్య ప్యాకెట్లలో వచ్చే నూనెలు ఎక్కవయిపోయాయి. ఏవేవో బ్రాండ్లతో దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. అవి ఎలాంటివో తెలుసుకోకుండానే మనం వాటిని కొనేయడం, వాటితో వండేయడం జరుగుతోంది. అసలు దానిలో ఎలాంటి పోషకాలు వున్నాయి... అవి ఏమయినా హాని చేస్తాయా అనేది చూడటం లేదు. కొన్ని నూనెలు ప్రమాదకర జబ్బులు తెస్తాయి. అందుకే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎస్ఎఫ్ఏ) మోతాదులను చూసి కొనుగోలు చేయాలి. ప్రతి ఆహారంలోనూ ఫ్యాట్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. 
 
ఈ ఫ్యాట్స్‌ను శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ అని వర్గీకరించి వైద్య నిపుణులు చెపుతారు. శాచురేటెడ్ ఫ్యాట్ వున్నవి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తాయ్. అదే పాలీ అన్‌శాచురెటెడ్ ఫ్యాట్లతో వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు మేలు జరుగుతుంది. ఇక మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ కూడా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడుతుంది కనుక ఇవి వున్న నూనెలను తీసుకోవచ్చు. 
 
కానీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చెడ్డవి. వీటివల్ల నూనెలు, ఫ్యాట్స్ మరింత చిక్కగా మారిపోతాయి. ఫలితంగా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడి గుండె జబ్బులు తలెత్తుతాయి. అందువల్ల అలాంటివి లేకుండా వున్న నూనెలు ఏమిటో తెలుసుకుని కొనుగోలు చేసుకోవాలి.