Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

46 డిగ్రీల సెంటీగ్రేడ్... భానుడి ఎండ దడ... వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

గురువారం, 18 మే 2017 (15:37 IST)

Widgets Magazine
sunstroke

వేసవి ప్రతాపం చురచురమంటోంది. భానుడి భగభగలతో ఇంచుమించు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని తెలుసుకోవాలో చూద్దాం.
 
* వడదెబ్బ తగిలిన వారికి.. ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి. చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి. 
 
* జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూను పొడిని, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకుని తాగాలి. పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి. 
 
* ద్రవపదార్థాలు మజ్జిగ, నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నివారించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
 
* పండిన చింతకాయలను నీటిలో పిండి ఆ రసంలో ఉప్పు కలిపి తాగవచ్చు. చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ తాగితే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. 
* శరీరంలో నీటి శాతం క్రమంగా ఉండేలా.. నీటిని సేవిస్తుండటం చేయాలి. ఎండల్లో తిరిగేటప్పుడు టోపీలు, గొడుగులు, చెప్పులు, కాటన్ దుస్తులు ధరించడం మరిచిపోకూడదు. 
 
* సన్ గ్లాసులు పెట్టుకోవడంతో పాటు ఎండల్లో ఉండాల్సి వచ్చినప్పుడు.. మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం వంటివి అప్పడప్పుడు తాగుతూనే ఉండాలి. దాహంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. శరీరంలో తేమ నిల్వ వుండేలా నీటితో కూడిన పుచ్చకాయ, దోసకాయల్ని కూడా తీసుకుంటూ వుండాలని వైద్యులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కూల్ డ్రింక్స్‌‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?

ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ ...

news

బీరు తాగిన వారిలో నొప్పులుండవ్.. ఆందోళన ఉండదట.. వేసవిలో తాగడం?

వేసవి కాలం మందు బాబు బీరు బాగా లాగించేస్తుంటారు. ఎండాకాలంలో చల్లిటి బీరుతో గొంతు ...

news

ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి ...

news

తెల్లసొనతో ముఖ సౌందర్యం.. ప్యాక్‌లా వేసుకుంటే మాట్లాడకూడదు..

తెల్లసొనతో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎగ్‌వైట్ కోసం ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ ...

Widgets Magazine