శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (11:28 IST)

శృంగారానికి ముందు పిజ్జా వద్దే వద్దు.. ఎందుకో తెలుసుకోండి..

శృంగారానికి ముందు పిజ్జా తీసుకోకపోవడం మంచిది. పిజ్జా కోసం ఉపయోగించే బేస్‌ని మైదాతో చేస్తారు. ఇది రాత్రిపూట తీసుకోవడం సరికాదు. మైదా శృంగార భావాల్ని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. అందువల్ల లైంగికజీవితం నిస్సారంగా సాగుతుంది. ఒకవేళ మసాలా ఉన్న పదార

శృంగారానికి ముందు పిజ్జా వద్దే వద్దు అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట అతిగా తినడం.. జీర్ణం కావడం కోసం శీతలపానీయాలను తీసుకోవడం మంచిది కాదని వారు సూచిస్తున్నారు. అతిగా తినడం, కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా.. పొట్ట నిండిపోయి.. భారంగా అనిపిస్తాయి. కొందరికి పొట్టలో గ్యాస్‌ చేరిపోయి ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇలాంటి అసౌకర్యం కలయికపై ప్రభావం చూపిస్తుంది. బదులుగా నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది.
 
అలాగే శృంగారానికి ముందు పిజ్జా తీసుకోకపోవడం మంచిది. పిజ్జా కోసం ఉపయోగించే బేస్‌ని మైదాతో చేస్తారు. ఇది రాత్రిపూట తీసుకోవడం సరికాదు. మైదా శృంగార భావాల్ని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. అందువల్ల లైంగికజీవితం నిస్సారంగా సాగుతుంది. ఒకవేళ మసాలా ఉన్న పదార్థాలు తినాలని అనిపిస్తే పాస్తాని సాస్‌తో ఎంచుకోవచ్చు. ముఖ్యంగా సాస్‌లో చీజ్‌, వెల్లుల్లి లేకుండా చూసుకుంటే మంచిది.
 
ఇంకా పడక గదిని సాధ్యమైనంత వరకూ ఆహ్లాదంగా, సువాసన భరితంగా ఉంచుకోవాలి. నోటి నుంచి కూడా దుర్వాసనలు రాకుండా చూసుకోవాలి. రాత్రిపూట ఉల్లిపాయ, వెల్లుల్లి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఇవి అతిగా తీసుకుంటే... గుండెలో మంట కూడా రావొచ్చు. 
 
అలాగే రాత్రిపూట బీన్స్ తీసుకోకూడదు. వీటిలో కొన్ని రకాల చక్కెర పదార్థాలుంటాయి. అవి అరుగుదలకు హాని చేస్తాయి. ఇలాంటివి ఉదయం పూట తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ రాత్రిపూట వీటిని తీసుకోకూడదు. గ్యాస్‌ సమస్యతో ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి పొట్టనొప్పికి కూడా కారణం కావొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.