గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (13:43 IST)

రోజుకు సగటున 25 గ్రాముల షుగర్ కంటే ఎక్కువొద్దు!

రోజుకు సగటున 25 గ్రాముల షుగర్ కంటే ఎక్కువ తీసుకోవద్దని డబ్ల్యూహెఓ సూచించింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఊబకాయం సమస్యను పరిష్కరించేందుకు షుగర్ వినియోగం తగ్గించడమే మార్గమని డబ్ల్యూహెఓ పేర్కొంది. 
 
ఈ మేరకు షుగర్ వాడకంపై డబ్ల్యూహెఓ మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో రోజువారీ వాడకంలో షుగర్ 10 శాతం మించకూడదని చెప్పిన డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు దానిని కేవలం 5 శాతనికే పరిమితం చేసింది. దీంతో రోజుకు సగటున 25 గ్రాముల షుగర్ కంటే ఎక్కువ తీసుకోవద్దని సూచించింది.
 
అంటే రోజుకు ఆరు టీ స్పూనుల షుగర్ కంటే ఎక్కవ తీసుకోకూడదు. అయితే పండ్లు, షుగర్ కలపని పండ్ల రసాలు, పాలలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు ఎలాంటి హాని చూపవని స్పష్టం చేసింది. పానీయాలలో కలిపే షుగర్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివే శరీరానికి హానికరమని, ఊబకాయానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.