స్మార్ట్ ఫోన్ల‌తో ఛాటింగ్ చేస్తున్నారా? నిద్ర గోవిందా.. అనారోగ్యాలు రమ్మంటాయ్..

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:36 IST)

mobile phone

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో రాత్రిపూట నిద్ర చాలామందికి కరువైంది. పనుల్ని చక్కబెట్టుకుని నిద్రకు ఉపక్రమించే ముందు సోషల్ మీడియా, ఛాటింగ్ వంటివి చేస్తూ వాటితో గంట గంటలు గడిపేస్తున్నారు. దీంతో నిద్ర తగ్గుతోంది. టెక్నాలజీ పెరగడం వలన పని ఎంత వేగవంతం అయిందో దాని వలన కలిగే హాని కూడా అంతే వేగం అయింది.

ముఖ్యంగా యువత, సాఫ్ట్ వేర్ జాబర్స్ సోషల్ మీడియాకు అలవాటుపడి సరైన నిద్రకు దూరమవుతున్నారు. దీంతో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. చాలామంది ఎక్కువగా చాట్ చేస్తూ, లేదా సినిమాలు చూస్తూ టైం తెలియకుండా రాత్రి నిద్రపోకుండా గడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుంది.
 
రాత్రి ఎప్పుడో నిద్రపోయి ఉదయానే లేచి స్టూడెంట్స్ అయితే హడావిడిగా కాలేజ్‌కి, ఉద్యోగులు ఆఫీసులకు రెడీ అయి వెళ్తుంటారు. ఇలాంటి వారికి రానున్న రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువత కనీసం 7-9 గంటలు, టీనేజర్స్ 8-10 గంటలు, చిన్న పిల్లలు అయితే 11-14 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెప్తున్నారు. అందుకే నిద్రపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు. కనీసం రోజుకి 7 గంటలు నిద్రపోకపోతే.. ఒబిసిటీ తప్పదంటున్నారు. 
 
నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే హాయిగా నిద్రపోవచ్చు. పడుకొనే ముందు కాఫీ, టీ లాంటివి తాగవద్దు. గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అంతేకానీ ఫోన్లకు అలవాటు పడితే అనారోగ్య సమస్యలు తప్పవని, డయాబెటిస్, ఒబిసిటీ వంటి ఇతరత్రా సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

హృద్రోగుల స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు: ఏడాదికి రూ. 4,450 కోట్ల మేర తగ్గనున్న భారం

గత పదేళ్లకు పైగా కార్పొరేట్ ఆసుపత్రులకు వేలకోట్ల రూపాయలను ధారపోసి తమాషా నడిపిన తర్వాత ...

news

దేశంలో పెరుగుతున్న మూర్ఛరోగులు : డాక్టర్ దినేష్ నాయక్

దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత ...

news

రోజూ ఓ అరటి పండు తినండి... ఆరోగ్యంగా ఉండండి..

ప్రతిరోజూ ఓ అరటి పండు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చునని.. అనారోగ్య సమస్యల నుంచి ...

news

గోంగూర తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు.. బట్టతల రాకుండా?

గోంగూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి ...