శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:41 IST)

కుంకుమ ధారణ అనేది కేవలం..?

స్త్రీలు కుంకుమ బొట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ వుంటారు. ఆధునిక కాలంలో నుదుటున కుంకుమ బొట్టుకు బదులుగా, వివిధ రకాల బొట్టు బిళ్లలను వాడడం అలవాటుగా మారిపోయింది. వస్త్రాలకు తగిన రంగు బొట్టును ధరించాలనే ఆలోచనే ఇందుకు కారణమైంది. అయితే నుదుటున కుంకుమ బొట్టు తప్ప మరేది ధరించినా ఆధ్యాత్మిక పరమైన దోషం... అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. 
 
రెండు కనుబొమల మధ్య అగ్నితత్త్వం ఉంటుందనీ, దానిని చల్లబరచడం కోసమే ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దడం జరుగుతోందని, కుంకుమ దిద్దకపోవడం వలన ఇక్కడి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రతి వారికి కూడా నుదురు అనేది ఒక శక్తిమంతమైన కేంద్రంగా వుంటుంది. ఇతరుల దృష్టి నేరుగా ఈ ప్రదేశంలో పడడం వలన ఆ వ్యక్తుల సహజమైన శక్తి బలహీనపడే అవకాశముంది. 
 
అందువలన ఇతరుల దృష్టిని నిరోధించేదిగా ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దుకోవడం అనాదిగా వస్తోంది. కాబట్టి కుంకుమ ధారణ అనేది కేవలం అందానికి ... అలంకారానికి మాత్రమేనని భావించకుండా, మన ఆచార వ్యవహారాలని గౌరవిస్తూ వాటిని అనుసరించవలసిన అవసరం అందరిపైనా వుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.