బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (10:19 IST)

వాషింగ్టన్ డీసీలో... స్వామియే శరణమయ్యప్పా..! భజనలతో దద్దరిల్లిన ఆలయం

భారతీయు దేశాలు దాటిని ఖండాంతరాలు దాటినా తమ ఉనికి కోల్పోవడం లేదు. సంస్కృతిని నమ్మకాలను, విశ్వాసాలను కాపాడుకుంటూనే వస్తున్నారు. స్వదేశంలో ఎలా వ్యహరిస్తారో అలాంటి భక్తి శ్రద్ధలనే కనబరుచుతున్నారు. ఉపాధికోసం ఊరు దాటి వచ్చామే కానీ... మాతృ దేశ ఆచారాలను మరిచే వారం కాదని చాటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని అమెరికాలోని వాషింగ్టన్ డీసీని అయ్యప్ప శరణుఘోషతో మార్మోగించారు. రాజధాని ఆలయంలో పూజలు మిన్నంటాయి. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కొన్ని లక్షల మంది తెలుగు వారు ఖండాంతరాలు దాటి అమెరికాలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. మరికొందరు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అక్కడున్న సంఘాలు వారి కోసం ఆలయాలు నిర్మించారు. ఇలా నిర్మించిన వాటిలో వాషింగ్టన్ డీసీ రాజధాని ఆలయం ఒకటి. అందులో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట చేసి ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ఈ సందర్భంగా అక్కడ భజనలు మిన్నంటాయి. స్వామి శరణుఘోషతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. 
 
ప్రతి యేడు కొందరు భక్తులు అయ్యప్ప మాలధారణ చేసి సంక్రాంతి నాడు మకర జ్యోతిని దర్శించుకుని వెళ్ళడం సర్వ సాధారణం. తాము ఎక్కడున్నా సరే నియమాలను తప్పనిసరిగా పాటిస్తుంటారు. ఈ యేడు వాషింగ్టన్ డీసీ నుంచి 55 మంది భక్తులు మాలధారణ చేశారు. వీరంతా కూడా జనవరి 1న శబరిమల బయలుదేరి మకరసంక్రాంతి నాడు జ్యోతిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజధాని ఆలయంలో అయ్యప్ప విగ్రహప్రతిష్ట జరిగి దశాబ్ధకాలం పూర్తి కావడంతో భక్తులు భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. తమ కుటుంబ సభ్యులతో సహా అక్కడకు చేరుకుని పూజలు చేశారు.