శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PNR
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (18:04 IST)

ముక్తి కోసం పవిత్ర మార్గాన్ని ఎంచుకోండి!!

ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు స్పష్టంగా బోధించాడు. ముఖ్యంగా.. "భగవద్గీత"లో శ్రీకృష్ణపరమాత్ముడు అర్జునునికి బోధించినట్టుగా ఉంటాయి. కానీ, అది సమస్త మానవాళికి బోధించిన సందేశం. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు.. "నా యందు విశ్వాసంతో పని చేయండి" అని చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతి చర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని గ్రహించండి. 
 
అయితే, ముక్తి మార్గం కోసం మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయాలి. ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సుని మరల్చాలి. మనస్సు, ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం కష్టమే. ఆ కష్టాన్ని అధికమించేందుకే యోగ, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనస్సు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనస్సును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది.