పక్షులకు కొంత ధాన్యం- పశువులకు కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (19:24 IST)

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల మాటలు మీ కోసం.. 
పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం.. ఇదే జీవితం అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. అలాగే ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతవుతాడని.. కానీ ఉన్నత పదవి వల్ల కాదని ఆయన తన ప్రవచనాల్లో తెలిపారు. 
 
ఇంకా కొన్ని.. 
మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషి గుర్తింపు రాదు. 
కేవలం డబ్బుంటే సరిపోదు- మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది. 
ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం లభిస్తుంది. 
మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
 
అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం - అతి చెడు గుణాలు.
నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.దీనిపై మరింత చదవండి :  
Speech Religion Golden Words Brahmasri Chaganti Koteswara Rao

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అలాంటి వారికి క్రూర మృగాలు కూడా సలాం కొడతాయి: స్వామి వివేకానంద

కారణమే కార్య మవుతుంది. కారణంవేరు, దాని ఫలితంగా జరిగే కార్యంవేరు కాదు. క్రియగా పరిణమించిన ...

news

నేను క్రిస్టియన్ కాదు.. హిందువుని... నన్ను కొనసాగించండి... ఎవరు?

ఏది ధర్మం.. ఏది అధర్మం. అన్ని కులాలు, అన్ని మతాలు ఒక్కటే. సమస్త జీవకోటిని చల్లంగా చూసే ...

news

శ్రీవారి ఆలయాన్ని మూశారు.. శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచారు.. (Video)

చంద్రగ్రహణం కారణంగా కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న ఆలయాన్ని మూసేశారు. చంద్రగ్రహణం ...

news

శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక రోజు పగలంతా మూసివేయనున్నారు. దీనికి కారణం ...