గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (20:28 IST)

తిరుమలలో పరిశుభ్రత పాటించకపోతే.. కొండ దించేస్తాం.. ఈవో

తిరుమలలో వ్యాపారాలు చేసుకుంటూ, దుకాణాలలో పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీ ఆరోగ్య శాఖ వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, అన్నదానం కాంప్లెక్సు, షాపింగు కాంప్లెక్సులు, కొబ్బరికాయల విక్రయ కేంద్రం, మఠాలు తదితర ప్రాంతాలలో నిశితంగా పరిశీలించి పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
 అవసరమనుకుంటే ఎటువంటి ఆలస్యం లేకుండా అక్కడ పని చేస్తున్న సిబ్బంది శిక్ష ఇప్పించాలని కోరారు. పరిశుభ్రతను అతిక్రమించిన దుకాణాలపై సీరియస్ చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు  సమావేశంలో పాల్గొన్నారు.